Posts

Showing posts from May, 2018

‘మహానటి’

Image
చిత్రం : ‘మహానటి’  నటీనటులు: కీర్తి సురేష్ - దుల్కర్ సల్మాన్ - సమంత అక్కినేని - విజయ్ దేవరకొండ - రాజేంద్రప్రసాద్ - షాలిని పాండే - మాళవిక నాయర్ - తనికెళ్ల భరణి - భానుప్రియ - దివ్యవాణి - తులసి తదితరులు అతిథి పాత్రలు: మోహన్ బాబు - ప్రకాష్ రాజ్ - నాగచైతన్య - క్రిష్ - అవసరాల శ్రీనివాస్ - తరుణ్ భాస్కర్ - నరేష్ తదితరులు సంగీతం: మిక్కీ జే మేయర్ ఛాయాగ్రహణం: డాని సాంచెజ్ - లోపెజ్ మాటలు: బుర్రా సాయిమాధవ్ నిర్మాతలు: అశ్వినీదత్ - స్వప్న దత్ - ప్రియాంక దత్ రచన - దర్శకత్వం: నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథతో సినిమా అన్నప్పట్నుంచి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఈ చిత్ర ప్రోమోలన్నీ కూడా క్యూరియాసిటీ పెంచాయి. తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే తనదైన ముద్ర వేసిన నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్.. స్వప్న సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉందో చూద్దాం పదండి. కథ:  సావిత్రి ఒక నటిగా మాత్రమే తెలిసిన జర్నలిస్ట్ మధురవాణి (సమంత).. అనారోగ్యంతో కోమాలోకి చే...

‘కాశి’

Image
చిత్రం: ‘కాశి’  నటీనటులు: విజయ్ ఆంటోనీ - అంజలి - సునైనా - అమృత అయ్యర్ - శిల్ప మంజునాథ్ - జయప్రకాష్ - నాజర్ - యోగిబాబు - ఆర్.కె.సురేష్ తదితరులుు సంగీతం: విజయ్ ఆంటోనీ ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్ మాటలు: భాష్యశ్రీ నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ రచన - దర్శకత్వం: కృతిగ ఉదయనిధి తమిళ సినిమాల్లో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు విజయ్ ఆంటోనీ.‘బిచ్చగాడు’ సినిమాతో అతడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఐతే ఆ సినిమా తెచ్చిన గుర్తింపును ఆ తర్వాత వచ్చిన విజయ్ సినిమాలు నిలబెట్టలేదు. అవి నిరాశ పరిచాయి. ఇప్పుడు విజయ్ ‘కాశి’ అవతారం ఎత్తాడు. ‘బేతాళుడు’ తరహాలోనే విడుదలకు ముందే తొలి ఏడు నిమిషాల సినిమాను రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించాడు విజయ్. మరి ఈ చిత్రం ఆ ఆసక్తిని ఏమేరకు నిలబెట్టిందో చూద్దాం పదండి. కథ:  భరత్ (విజయ్ ఆంటోనీ) అమెరికాలో పేరు మోసిన డాక్టర్. అతడి ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రి అమెరికాలోనే ది బెస్ట్ అనిపించుకునే దిశగా సాగుతుంటుంది. ఐతే భరత్ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంటుంది కానీ.. చిన్నతనం నుంచి ఒక పీడకల అతడిని వెంటాడుతూ ఉంటుంది. అదెందుకన్నది అతడికి అర్...