‘మహానటి’
చిత్రం : ‘మహానటి’ నటీనటులు: కీర్తి సురేష్ - దుల్కర్ సల్మాన్ - సమంత అక్కినేని - విజయ్ దేవరకొండ - రాజేంద్రప్రసాద్ - షాలిని పాండే - మాళవిక నాయర్ - తనికెళ్ల భరణి - భానుప్రియ - దివ్యవాణి - తులసి తదితరులు అతిథి పాత్రలు: మోహన్ బాబు - ప్రకాష్ రాజ్ - నాగచైతన్య - క్రిష్ - అవసరాల శ్రీనివాస్ - తరుణ్ భాస్కర్ - నరేష్ తదితరులు సంగీతం: మిక్కీ జే మేయర్ ఛాయాగ్రహణం: డాని సాంచెజ్ - లోపెజ్ మాటలు: బుర్రా సాయిమాధవ్ నిర్మాతలు: అశ్వినీదత్ - స్వప్న దత్ - ప్రియాంక దత్ రచన - దర్శకత్వం: నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథతో సినిమా అన్నప్పట్నుంచి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఈ చిత్ర ప్రోమోలన్నీ కూడా క్యూరియాసిటీ పెంచాయి. తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే తనదైన ముద్ర వేసిన నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్.. స్వప్న సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉందో చూద్దాం పదండి. కథ: సావిత్రి ఒక నటిగా మాత్రమే తెలిసిన జర్నలిస్ట్ మధురవాణి (సమంత).. అనారోగ్యంతో కోమాలోకి చే...